22 July, 2026 | 6:48 PM

అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం

22-07-2026 05:39 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం సెక్టార్ పరిధిలోని కొత్త దొనబండ తండా అంగన్వాడి కేంద్రంలో టీచర్ సంతోషికుమారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు, బక్కమంతుల గూడెం సెక్టార్ సూపర్వైజర్ సోమమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అన్న ప్రసన్నం, అక్షరభ్యాసం, శ్రీమంతం,పుట్టిన రోజు వేడుకలు లాంటి కార్యక్రమాలను అంగన్వాడి సెంటర్లో నిర్వహించుకోవాలని, గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించాలని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి సూచించారు.