SIR ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్
తాంసి,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి , బండల్ నాగాపుర్, సావర్గాం, జామిడి, గోట్కూరి గ్రామాల్లో చేపడుతున్న SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి , బండల్ నాగాపుర్, సావర్గాం, జామిడి, గోట్కూరి గ్రామాల్లో చేపడుతున్న SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి బుధ వారం పరిశీలించారు.(AMC) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి బుధ వారం పరిశీలించారు. గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా జరుగుతున్న ప్రక్రియ వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారాలు నింపకపోతే ఓటు పోయే ప్రమాదం ఉందని, బీఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రానున్న రోజుల్లో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం ఓటు హక్కు వినియోగంపైనే ఆధారపడి ఉంటుందని, ఓటు హక్కును వినియోగించుకోని వారికి ప్రభుత్వ పథకాలు అందవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అశోక్, బండే గంగాధర్, ఎస్.కె. మతిన్, ఉప సర్పంచ్ గణేష్, తాంసి మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్, ఆత్మ మెంబర్ కౌడాల నారాయణ, నాయకులు శ్రీధర్ రెడ్డి, వెంకన్న, సురేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కేమ హనుమాన్, దేవల గంగాధర్, సౌర్గామ జీవన్, గంగాధర్, పురుషోత్తం, నర్సింగ్, బాపు రెడ్డి, సుభాష్ రెడ్డి, నరోత్తం రెడ్డి, వికాస్ రెడ్డి, ఎండి కమ్రుద్దీన్, నిమ్మల మల్లయ్య, ఎస్.కె. అష్వాక్, బెజ్జంకి రోహిత్, ఇస్మాయిల్, తాటి అశోక్, ఆకుల సునీల్, కె. అశోక్, ఎన్. రవిలతో పాటు రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






