22 July, 2026 | 6:47 PM

విజ్ఞాన్ పాఠశాలలో మెహందీ వేడుకలు

22-07-2026 05:50 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్థానిక విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం లో ఆషాడ మాసంలో నిర్వహించే మెహందీ గోరింటాకు కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు చేతులకు గోరింటాకుతో అలంకరణ చేసుకొని ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లింగయ్య మాట్లాడుతూ... ప్రతి ఆషాడ మాసంలో జరుపుకునే మెహందీ కార్యక్రమం తెలంగాణలో ఆనవాయితీగా ఉందని మెహందీ గోరింటాకు అలంకరణ చేతులకు కాళ్లకు చేయడం వల్ల శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తూ చిన్న చిన్న చర్మ రుగ్మతలను కూడా నయం చేసుకోవచ్చని గోరింటాకు చిన్న పెద్ద తేడా లేకుండా పెట్టుకోవచ్చు అని సైన్స్ పరంగా ఆరోగ్య దాయకమైనది అన్నారు.