22 July, 2026 | 6:00 PM

Breaking News

సోయాచిక్కుడు, వరి పొలాల్లో క్షేత్ర సందర్శన

22-07-2026 04:56 PM

 – రైతులకు కీలక సూచనలు

బోధన్,(విజయక్రాంతి): పోతంగల్ మండలంలోని హేగ్డోలి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రుద్రూరు సీనియర్ శాస్త్రవేత్త & హెడ్ డా. కె. ఇందుధర్ రెడ్డి క్షేత్ర సందర్శన నిర్వహించి, సోయాచిక్కుడు మరియు వరి పంటల సాగుపై రైతులకు పలు సాంకేతిక సూచనలు అందించారు.

సోయాచిక్కుడు పంటకు సూచనలు

ప్రస్తుతం సోయాచిక్కుడు పంట 20–25 రోజుల దశలో ఉందని, ఈ సమయంలో ఎకరానికి 25 కిలోల యూరియా పైపాటుగా వేయాలని సూచించారు.

కలుపు నివారణకు:

ఇమజిథాపైర్ + ఇమాజోమాక్స్ – 40 గ్రా/ఎకరం లేదా

ఇమజిథాపైర్ 10% – 250 మి.లీ/ఎకరం లేదా

ఫోమిసేఫ్ + ఫ్లుజిఫాప్-పీ-బ్యూటైల్ – 400–500 మి.లీ/ఎకరం పిచికారి చేయాలని తెలిపారు.

చీడపీడల నివారణకు:

రసం పీల్చే పురుగుల నియంత్రణకు ఎసిఫేట్ 1.5 గ్రా లేదా ఫిప్రోనిల్ 2 మి.లీని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనిపిస్తే 10 లీటర్ల నీటికి 1 గ్రా స్ట్రెప్టోసైక్లిన్ కలిపి పిచికారి చేయాలని సూచించారు.

వరి పంటకు సూచనలు

ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు సాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దుబ్బు దశలో పంట ఉందన్నారు.

కలుపు నివారణకు

నాటు వేసిన 2–3 రోజుల్లో ప్రెటిలాక్లోర్ 50% ఈసీ 400–600 మి.లీ/ఎకరం ఇసుకలో కలిపి చల్లాలి.

నాటు వేసిన 15–20 రోజుల తర్వాత మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ 20% డబ్ల్యూపీ 8 గ్రా లేదా ట్రయూఫామోన్ + ఇథాక్సీసల్ఫూరాన్ డబ్ల్యూజీ 90 గ్రా/ఎకరం పిచికారి చేయాలి.

చీడపీడల నివారణకు:

నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 800 గ్రా చల్లి కాండం తొలుచు పురుగును నివారించాలి. దుబ్బు దశలో కార్బోఫ్యూరాన్ 3జీ 10 కిలోలు/ఎకరం లేదా క్లోరాన్ట్రనిలిప్రోల్ 0.4జీ 4 కిలోలు/ఎకరం వేయాలి. ప్రత్యామ్నాయంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్‌పీ 2 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారి చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ శంకర్, జగిత్యాల వ్యవసాయ కళాశాల RAWEP విద్యార్థినులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.