12 May, 2026 | 2:26 AM

బీఆర్‌ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

12-05-2026 01:23 AM

భీమదేవరపల్లి, మే 11 (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ నాయకులను మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సోమవారం పరామర్శించారు.

ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ తంగెడ శాలినీ భర్త, మాజీ మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, ఎల్కతుర్తి మాజీ సర్పంచ్ మాధవి భర్త గొల్లె మహేందర్ లు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. దీంతో సోమవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆస్పత్రికి వెళ్ళి వారిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ మండల ఆధ్యక్షులు పిట్టల మహేందర్, నాయకులు ఎల్తూరి స్వామి, సత్తూరి చంద్రమౌళి,జూపాక జడ్సన్, వేముల సమ్మయ్య భీమదేవరపల్లి మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మండల సురేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వేముల శ్రీనివాస్, మండల నాయకులు తదితరులు ఉన్నారు.