20 May, 2026 | 1:34 AM

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

20-05-2026 12:17 AM

చిన్నంబావి,మే19:మండల పరిధిలోని కొప్పునూరు గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నరెడ్డి తల్లి పుల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం మృతి దేహానికి పులామాల వేసి నివాళులర్పించి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ,శ్రీధర్ రెడ్డి, ఈదన్న యాదవ్ రంజిత్ కుమార్,జయ గౌడ్,రామకృష్ణ,డేగ శేఖర్, తగరం నరసింహ,పార్టీ నాయకుల తదితరులు పాల్గొన్నారు.