ఐకేపీ కార్యాలయానికి తాళం వేసిన రైతులు
20-05-2026 12:16 AM
నిర్మల్, మే 19 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రంలో అక్రమాలపై రైతులను తీసి కార్యాలయానికి తాళం వేశారు. ఐకెపి సిబ్బంది ధాన్యం కొనుగోలలో ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికి పంట కొనుగోలు చేస్తున్నారని వారు నిరసన తెలిపి ఐ కే బి సిబ్బందిని నిలదీశారు. అనంతరం కార్లానికి తాళం వేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.






