08-02-2026 12:09:41 AM
3వ డివిజన్‌లో లక్ష్మీప్రియకు మద్దతు తెలపండి
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత చింతల రామచంద్రారెడ్డి
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూడవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీప్రియ డివిజన్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో భారీగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత చింతల రామచంద్రారెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో 420 రకాలుగా ప్రజలను మోసం చేస్తుందని ధ్వజ మెత్తారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తనదిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి మార్పు రావాలని, మూడవ డివిజన్‌లో కచ్చితంగా బీజేపీఅభ్యర్థిని గెలిపించా లని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ డివిజన్‌లో గతంలోనే బీజేపీ కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించిన రామాంజనేయులు ఎనలేని అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతు తెలియజేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.