2 May, 2026 | 2:28 AM

త్వరలో టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి జనార్దన్?

02-05-2026 01:27 AM

అధ్యక్షురాలు కవితతో భేటీ

మంచిర్యాల, మే 1 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా వాసి, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) లో చేరనున్నట్లు సమాచారం. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

బోడ జనార్దన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ శాసన సభ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పని చేశారు. త్వరలోనే తన అనుచరులతో చేరి సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్‌ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.