calender_icon.png 21 February, 2026 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు ఉద్యమానికి మనుగడలేదు

21-02-2026 03:37:36 PM

  1. నేను ప్రజలతోనే ఉన్నా.. ప్రజలతోనే ఉంటా.
  2. మార్చి 31లోగా తుపాకులు వీడాలి.
  3. త్వరలోనే దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అజ్ఞాతం వీడుతారు.
  4. ప్రజలు కోరుకుంటే రాజకీయ బాట.
  5. త్వరలోనే పుట్టిన తెలంగాణకు వస్తా.
  6. ఉద్యమంలో ఉన్నవాళ్లందరూ వృద్ధులైపోయారు.

హైదరాబాద్: ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి మనుగడలేదని మావోయిస్టు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) అన్నారు. మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడం లేదని పేర్కొన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లందరూ వృద్ధులైపోయారని చెప్పారు. చైనా, రష్యా బూజు సిద్ధాంతాలపై ఉనికిని కొనసాగించలేమని తెలిపారు.

తనను ద్రోహి అన్నవారికి కాలమే సమాధానం చెబుతోందన్న మల్లోజుల తాను ప్రజలతోనే ఉన్నా.. ప్రజలతోనే ఉంటానని పేర్కొన్నారు. తన సహచరులు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మార్చి 31లోగా తుపాకులు వీడుతారని భావించారు. త్వరలోనే దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అజ్ఞాతం వీడుతారని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ బాట పడుతానని వెల్లడించారు. త్వరలోనే పుట్టిన తెలంగాణకు వస్తానని స్పష్టం చేశారు. అర్భన్ మావోయిజం అనేది లేదన్నారు.