13 May, 2026 | 6:44 PM

ఆడపిల్లలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలి

13-05-2026 05:36 PM

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్,(విజయక్రాంతి): ఆడపిల్లలను చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో ప్రోత్సహించి ఉన్నత స్థాయిలో ఉండేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. బుధవారం ఖానాపూర్ మున్సిపాలిటీ లోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన భేటీ బచావో బేటి పడావో అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను సంరక్షించి చదువు, ఉద్యోగాలు, క్రీడల్లో ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మిషన్ శక్తి సంకల్ మహిళ సాధికారత కేంద్రం అధికారులు, మెప్మా సిబ్బంది ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.