calender_icon.png 21 February, 2026 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతగిరి చేరుకున్న సీఎం రేవంత్

21-02-2026 03:07:32 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా అనంతగిరికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు సీఎం, మంత్రులకు స్వాగతం పలికారు. కాసేపట్లో హరిత రిసార్ట్ లో తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. డీ

సీసీ అధ్యక్షుల శిక్షణ(DCC Presidents Training) తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీహాజరయ్యే అవకాశముందని పార్టీ నేతలు పేర్కొన్నారు.