13 May, 2026 | 6:44 PM

చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

13-05-2026 05:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ నర్సాపూర్ మండలాల్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. సారంగాపూర్ లో 208 నర్సాపూర్లో 49 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ముందుగా గ్రామంలో రూ. 20 లక్షలతో PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలానికి చెందిన 49 లబ్ధిదారులకు  కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లైన ఆడ బిడ్డలకు లక్ష రూపాయల తో పాటు తులం బంగారం ఇస్తామంటూ ఎన్నికల్లో బూటకపు హామీ ఇచ్చారని అన్నారు.