13 May, 2026 | 6:46 PM

మంజూరి చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రచారం బీఆర్ఎస్ నాయకులది

13-05-2026 05:28 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూ.70 లక్షలు మంజూరు చేయిస్తే స్థానికంగా ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మంజూరు అయిన ప్రొసీడింగ్ కాపీని పట్టుకొని తాము మంజూరి చేయించామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సహకార సంఘం డైరెక్టర్ లోలపు పోశెట్టి పేర్కొన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు విషయం మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తాము చేసామంటూ గొప్పలు చెప్పుకున్నారన్నారు.

నిధుల మంజూరు కోసం సోనాల మండల కేంద్రానికి చెందిన ఏఐసీసీ రాష్ట్ర విచార విభాగ కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ల సహకారంతో నిధులు మంజూరయ్యాయి అన్నారు.రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు లను పలుమార్లు కలిసి నిధులు మంజూరు చేయించారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంజూరు అయిన వాటిని పాము చేయించామని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలని హితవు పలికారు.