16 August, 2026 | 7:38 PM

బడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్...

16-08-2026 07:08 PM

బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. బడా పహాడ్ దర్గాకు విచ్చేస్తున్న భక్తులకు బడా పహాడ్ కు వెళ్లే రహదారికి గుర్తుగా కమాను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ని మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.