16 August, 2026 | 8:01 PM

రేపు ప్రజావాణి.. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

16-08-2026 07:10 PM

బెజ్జూర్ ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకున్న కార్యక్రమం ప్రజవాణి రేపు రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి పౌరునికి ప్రభుత్వం జవాబుదారిగా ఉండటానికి, రాష్ట్ర పౌరులకి ప్రభుత్వం సేవలoదించడానికి. ఈ ప్రజావాణి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని వారియొక్క అపర్శి కృత సమస్యలపై ప్రభుత్వం అర్జీలు స్వీకరించినుంది. వాటిపై మండల అభివృద్ధి అధికారిని మండల నోడల్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించిన సంగతి మీకు విధితమే.. కావున మన బెజ్జుర్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలను విన్న వించుకుంటే ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.