16 August, 2026 | 8:32 PM

మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది

16-08-2026 07:34 PM

కుభీర్, ఆగస్టు 16: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కుభీర్ మండలం మాలేగాం గ్రామంలో చోటుచేసుకుంది. మలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39) కొంతకాలంగా మద్యానికి తీవ్రంగా బానిసై ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో ఆదివారం జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భోజన్న మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.