శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్
14-07-2026 12:53 AM
బాన్సువాడ, జూలై 13 (విజయ క్రాంతి):కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని శ్రీ శ్రీ శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆరుద్ర నక్షత్రం సోమవారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేయించి, ప్రజల శ్రేయస్సు కోసం స్వామీ వారిని ప్రార్థించారు,ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి, శివనామస్మరణలతో మార్మోగింది.ఈ కార్యక్రమంలో బాన్సువాడ వ్యాయామశాల హనుమాన్ ఆలయ అధ్యక్షులు నార్ల సురేష్,నసురుల్లాబాద్ మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.






