2న మహంకాళి బోనాలు
3న రంగం..
ఆషాఢ బోనాలకు సర్వం సిద్ధం
16 నుంచి ఆగస్టు 13 వరకు గోల్కొండ నుంచి లాల్ దర్వాజా వరకు ప్రత్యేక ఏర్పాట్లు
3,427 దేవాలయాలకు రూ.15.౦౫ కోట్లు విడుదల
మంత్రి పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిం దని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
16న గోల్కొండలో ప్రారంభం
జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా 20న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21 న అమ్మవారి కళ్యాణం, 22 న రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం. ఆగస్టు 9న హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతోపాటు నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
పాత జీహెచ్‌ఎంసీలోని 3,427 దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిమిత్తం 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో విడుదల చేసిన ట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.
బోనాల సందర్భంగా గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ - పోచమ్మ, హరిబౌలిలోని అక్కన్న- మాదన్న దేవాల యం, కార్వాన్ దర్బార్ మైసమ్మ, లాల్దర్వా జా శ్రీ సింహవాహిని మహంకాళి, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి ఆలయాలతో పాటు నగరంలోని 30 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు, ఇతర ముఖ్య నేతలు అధికారులు, సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించే కార ్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బోనాల అనంతరం ఫలహారం బండ్ల ఊరేగింపు జరగనుంది. భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు పోలీసు, ప్రభుత్వ శాఖల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి భక్తుడికి సురక్షితమైన,సౌకర్యవంత మైన దర్శనం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సులను నడిపిస్తున్నందున రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.






