14 August, 2026 | 4:20 AM

మాజీ సీఎం బావమరిది మృతి

14-08-2026 01:23 AM

కొదురుపాకలో  విషాదం

బోయినపల్లి,ఆగస్టు 13(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక  గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి శ్రీనివాసరావు గురువారం అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మాజీ సీఎం కేసీఆర్‌కు స్వయానా శ్రీనివాసరావు బావమరిది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినపల్లి కేశవరావు లక్ష్మీదేవి  దంపతులకు కేసీఆర్ సతీమణి శోభ, శశికళ, స్వర్ణ కూతురులతోపాటు కుమారుడు శ్రీనివాసరావు జన్మించారు.

మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో పనిచేసి మండలంలో పాటు తడగొండ గ్రామానికి తన సొంత డబ్బులతో పలు అభివృద్ధి పనులకు కృషి చేశారు. గత రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య స్వరూప, కూతురు గౌతమి, కుమారుడు వివేక్ ఉన్నారు. ఈయన మృతితో కొదురుపాకలో విషాదం అలముకుంది. బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు, అభిమానులు నగరానికి తరలివచ్చారు.