30 August, 2026 | 9:35 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

టచ్‌లోనే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

18-04-2026 12:05 AM

చిట్‌చాట్‌లో కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు తనతో టచ్‌లోనే ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీన తమ కొత్త పార్టీ ఆవిర్భావం తర్వాత వారెవరో బయటకు వస్తుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో కవిత చిట్‌చాట్ నిర్వహించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి, ఇప్పుడు ఒక్కసారిగా జ్ఞానోదయమై పాదయాత్రలు గుర్తొచ్చాయా? అని ఎద్దేవా చేశారు.

ప్రజలపై ప్రేమతో ఈ యాత్రలు చేయడం లేదని.. అధికారాన్ని కోల్పోయామన్న ఆవేదనతోనే ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. హరీష్‌రావుది అంతా కుట్ర రాజకీయమని విమర్శించారు. ప్రజా సమస్యలను తీర్చేది అధికార పార్టీ కాబట్టి ఆ పార్టీపైనే మాట్లాడుతున్నట్లు తెలిపారు. సమస్యను బట్టి బీఆర్‌ఎస్‌ను కూడా వదిలిపెట్టనన్నారు. శని పోవాలనే తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని చెప్పారు. తన పార్టీ సక్సెస్ కావాలని కోరుకున్నట్లు తెలిపారు.