04-02-2026 01:30:12 AM
తాండూరు, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్త్య విఠల్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, విఠల్ నాయక్కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, ఏఎంసి చైర్మన్గా చేసిన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని అన్నారు. విఠల్ నాయక్ మాట్లాడుతూ, పైలెట్ నాయకత్వం లో మున్సిపల్ పై టిఆర్‌ఎస్ జండా ఎగురవేస్తామని అన్నారు.