25 July, 2026 | 12:59 AM

విద్యార్థుల సమస్యలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

25-07-2026 12:00 AM

ఫీజుల బకాయిలు, బీజేపి లడాయి గోడ పత్రికల ఆవిష్కరణ

భూపాలపల్లి టౌన్, జులై 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు విస్మరించిందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రావు, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో బీజేవైఎం మాజీ కార్యవర్గ సభ్యులు ఓరుగంటి భగవాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫీజుల బకాయిలు, బీజేపి లడాయి సన్నాహక సమావేశం నిర్వహించగా వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.12 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు పెండింగులో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేసి సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫీజుల బకాయిలు, బీజేపి లడాయికి సంబంధించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మహేష్, లాడె శివ, వంశీ, సురేష్, శివరాజ్, హరీష్, దేవేందర్, మణికుమార్, సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.