నీట్ పేపర్ లీక్‌పై కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ రాస్తారోకో
హనుమకొండ, జూలై 24 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ,విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన మేమున్నాం అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసన అనంతరం రాస్తారోకోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని కాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్ర మంలో తాజా మాజీ కార్పోరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ రజాలి,ఎస్సీ సెల్ నా యకులు ఆరూరి సాంబయ్య, సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, డా. శ్రవణ్, దొంగల కుమా ర్, సీరిల్ లారెన్స్, షేక్ అజ్గర్, షబ్బీర్, తమ్మడి మానసమధు, మాచర్ల జయకర్, బర్ల రాజ్కుమార్, పోగుల శ్రీనివాస్, మంతుర్తి బొంద్యాలు, శివరాం, రవికిరణ్, సుంచు ప్రవీణ్, ప్రశాంత్, రజియా, కొండ శివ, జై రావు, బొడ్డు రామ్, గాలి శ్రీను, మాతంగి స్వామి, దార్ల రాజ్కుమార్, గోరుకాటి రవి, గుగ్గిళ్ల అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






