24 July, 2026 | 10:38 PM

కుమ్మన్‌పల్లి గ్రామంలో "మన ఊరు – మన భద్రత – మన బాధ్యత" అవగాహన

24-07-2026 09:59 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మన్‌పల్లి గ్రామంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్, బోధన్ రూరల్ ఆధ్వర్యంలో, ఎస్‌హెచ్‌ఓ నేతృత్వంలో "మన ఊరు – మన భద్రత – మన బాధ్యత" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళలు, చిన్నారుల రక్షణ, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవల వినియోగం, అలాగే పాముకాటు, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.