12 June, 2026 | 4:17 AM

అటవీ శాఖ ఆధ్వర్యంలో వన దర్శిని

12-06-2026 12:57 AM

నిర్మల్ జూన్ 11 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గండి రామన్న అర్బన్ పార్క్, చించోలిలో శ్రీమతి నాగిని భాను గారు, అటవీ మండలాధికారి, నిర్మల్ గారి అధ్యక్షతన వనమహోత్సవం మరియు వనదర్శిని కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు మరియు జీవవైవిధ్య సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణారావు గారు, అటవీ క్షేత్రాధికారి, నిర్మల్, సంతోష్ , ఎం.డి. నజీర్ ఖాన్, రాజశేఖర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, చించోలి(బి) సర్పంచ్ శ్రీ సాయన్న గారు, కౌన్సిలర్ శ్రీ ఇర్ఫాన్ గారు, పారమూరు సర్పంచ్ గారు, డేంగాపూర్ సర్పంచ్ గారు, కో-ఆప్షన్ మెంబర్ శ్రీ అస్లం గారు, స్థానిక ప్రజలు మరియు అటవీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.