విదేశీ విరాళాల బిల్లు జేపీసీకి..
విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 12: విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్‌ఏ) సవరణ బిల్లు- కేంద్రం కీలక నిర్ణయం తీసుకుం ది. వివాదాస్పదంగా మారిన ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపే ప్రతిపాదనను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. విపక్షాల ఆందోళనలు, నిరసనల నడుమ ఇది చోటుచేసు కుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బిల్లును జేపీసీకి పంపే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాల తొలివారం చివరి రోజున జేపీ సీ తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛం ద సంస్థలు, సేవా సంస్థల కార్యక లాపాలపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని వర్గాలను, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ నిబంధనలు తెచ్చారని అఖిలేష్‌యాదవ్ విమర్శించారు. ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, టీఎంసీ, డీఎం కేతో పాటు పలు క్రైస్తవ సంఘాలు, మిజో రం, నాగాలాండ్ ముఖ్యమంత్రులు డిమాం డ్ చేశారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో సమగ్ర చర్చ కోసమే బిల్లును జేపీసీకి పంపినట్లు కేంద్రం పేర్కొంది.






