14 June, 2026 | 4:15 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

పలుచని కురులకు!

11-05-2025 12:00 AM

* ఒక చెంచా నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని కుదుళ్లకు రాయాలి. జుట్టు పలచగా ఉన్న ప్రాంతాల్లో అలాగే చుండ్రు ఉన్నచోట ఈ పేస్టును అప్లు చేసి మృదువుగా పది నిమిషాలపాటు మర్దన చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లకు పోషకాలు అందుతాయి. కురుల మొదళ్లు ఆరోగ్యంగా మారి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి.

* చెంచా నిమ్మరసానికి ఒక గుడ్డు సొనను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టించి ఆరనిచ్చి స్నానం చేస్తే చాలు. ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీయాసిడ్లు మెండుగా ఉండే గుడ్డు సొన జుట్టుకు పోషణనిచ్చి, కురులు పెరగడానికి దోహదపడుతుంది. 

* ఒక గిన్నెలో చెంచా నిమ్మరసం, రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి మృదువైన జెల్‌గా మారేవరకు బాగా కలపాలి. జుట్టు రాలిన చోట దీన్ని రాసి చర్మం పీల్చుకునేవరకూ మృదువుగా మర్దన చేసి, అరగంట ఆరనిచ్చి తలస్నానం చేయాలి. దీనివల్ల మాడుపై పీహెచ్‌స్థాయులు సమన్వయమవుతాయి.