14 July, 2026 | 4:47 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

గుడుంబా నిషేధంపై ధనియాలపాడు గ్రామపంచాయతీలో వెలిసిన ఫ్లెక్సీ

19-04-2026 03:04 PM

గుడుంబాపై ధనియాలపాడు పంచాయతీ కఠిన హెచ్చరిక

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలు పెరగడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ సనప సావిత్రి వెంకన్న అధ్యక్షతన సమావేశమై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి మాట్లాడుతూ... గుడుంబా వల్ల యువతతో పాటు చిన్నారులు కూడా వ్యసనానికి గురై ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇకపై గ్రామంలో ఎవరైనా సారాయి తయారు చేయడం, అమ్మడం, తాగడం చేస్తే ఎక్సైజ్ పోలీసులకు అప్పగించి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని, భారీ జరిమానాలు విధించి ఆస్తుల జప్తు వరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు గుడుంబాను పూర్తిగా నిరోధించేందుకు సహకరించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అందులో భాగంగా గ్రామస్తులకు అవగాహన కల్పించుట కొరకు పంచాయతీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు నాయక్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.