14 July, 2026 | 4:01 PM

Breaking News

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •  

వధువు వివాహానికి చేయూత

19-04-2026 03:08 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 17వ వార్డులో పేద కుటుంబానికి చెందిన బాలిక వివాహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పెండాల రాజు, పెండాల హరికృష్ణ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సయ్యద్ హమీద్ కుమార్తె సయ్యద్ కరిష్మా వివాహం సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లి రూ.5000 నగదు సహాయం, చీర అందజేశారు. ఈ సందర్భంగా పెండాల రాజు మాట్లాడుతూ పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు తాము అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాడిశెట్టి రాజు, ఎస్డీ బాబా, జియా, ఆలూరు మురళి, జేమ్స్ విక్కీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.