20 June, 2026 | 7:00 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా

17-03-2026 01:49 AM

భిక్కనూర్, మార్చి16 (విజయ క్రాంతి): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి టీ. చంద్రశేఖర్ తీర్పు వెలువరించారు.

భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపినందుకు అక్కల శరత్ (భిక్కనూర్), శ్రీనివాస్ రావు (ఉప్పల్వాయి), ఆర్. మల్లేశం (భగీర్తిపల్లి), ఓ. చిన్న (చిన్నమల్లారెడ్డి), జి. విజయ్ కుమార్ (భిక్కనూర్) పై కేసులు నమోదు చేశారు. కోర్టు విచారణ అనంతరం న్యాయమూర్తి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. ఈ వివరాలను ఎస్‌ఐ డి. అంజనేయులు తెలిపారు.