9 April, 2026 | 9:20 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఐదు రోజులు వర్షాలు

05-10-2025 12:00 AM

-9వరకు వానలుకురిసే అవకాశం

-పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ. వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హను మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,  నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే సోమవారం రాష్ట్ర వ్యాప్తం గా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం 27 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈనెల 9 వరకు వర్షాలు కురుస్తాయని సూచించింది.