31 August, 2026 | 3:28 AM

ప్రయాణికులు కిటకిట.. ఆర్టీసీ కటకట

31-08-2026 01:13 AM
  1. స్పెషల్ బస్ పేరుతో దోపిడీ 
  2. రెగ్యులర్ సర్వీసులు రద్దు 
  3. పండుగ పూట ప్రజల పరేషాన్ 

నిర్మల్ ఆగస్టు 30 ( విజయ క్రాంతి) ప్ర యాణికుల సేవ ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ పండు గ వచ్చింది అంటే పైసల దోపిడి చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాఖీ పండుగ కు ఆర్టీసీ బస్సులను నడిపిస్తామన్న అధికా రులు వివిధ రూట్లో స్పెషల్ బస్సుల్లో పేరు తో అదనపు చార్జీలు పట్టించి సామాన్యులపై వారం మోపుతున్నారు. నిర్మల్ బైంసా డిపో పరిధిలో గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు షెడ్యూలు ప్రకారం నడిచి బస్సులకు స్పెషల్ బోర్డులు ఏర్పాటు చేసి మగవారికి ఒకటిన్నర చార్జి వసూలు చేయడంతో చాలామంది కండక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు.

మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తున్న అధికారులు పండుగ సమయంలో హైదరాబాదు నిజామాబాద్ వరంగల్ నుంచి వచ్చిపోయే పిల్ల లకు మదనపు చార్జీలు పెట్టడంపై మండిపడుతున్నారు. హైదరాబాద్ వరంగల్ దగ్గర ప్రాంతాలకు నడిపించే రెగ్యులర్ సర్వీస్ లను రద్దు వాటి స్థానంలో స్పెషల్ బస్సులు ఏ ర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ పల్లె వెలుగు బ స్సులకు రెడ్డి గూడూరు తొలగించి ఎక్కువ చార్జీ వసూలు చేసిన అధికారులు ఎక్స్ప్రెస్ హాల్టులు కాకుండా ఆర్డినరీ బస్టాప్ లో ఆపి ప్రయాణికులకు ఇబ్బంది

కలిగిస్తున్నారని ప్ర యాణికులు వాపోతున్నారు. పండుగ పూట సంబరంగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిపి తిరిగి వెళ్దామంటే బస్సు చార్జీలు వసూలు చేయడంపై పలువురు మహిళలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి ఆదాయం పై ఉన్న సిద్ధ ప్రయాణికుల సంక్షేమంపై ఏ మాత్రం కనిపించడం లేదు. రద్దీ పెరిగిన బ స్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అవసరాలను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు అదన పు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ మరింత భారా న్ని మోపడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రో వ్యక్తం చేస్తున్నారు.

వీలది మంది పి ల్లలు హైదరాబాదులో ఉండి చదువుకుని పండుకు వచ్చి పోతే వారికి భారం వేయడం ఏంటని అదే లక్ష రూపాయలు ఉన్న ప్రభు త్వం మహిళా ఉద్యోగులకు ఫ్రీ టికెట్ ఎందుకని స్కూటీగా కలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఆ ర్టీసీ అధికారులకు అడుగుతే ఉన్నత అధికారుల ఆదేశం తాము ఈ బస్సులను ఏర్పా టు చేశామని తమ తప్పేమీ లేదని తప్పించుకుంటున్నారు.

ఫ్రీ బస్ జర్నీ కోసం వచ్చిన వారు బస్సులు రద్దు కావడంతో చేతిలో పై సలు లేక కుటుంబ బంధువులకు ఫోన్ చేసి పైసలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింద ని పలువురు ప్రయాణికులు పేర్కొంటు న్నా రు. ఇప్పటికైనా అధికారులు పండుగ పూట ప్రజలపై భారం మోపకుండా ప్రజల కు మె రుగైనసేవలు అందించాలని కోరుతున్నారు.