మన్సూరాబాద్‌లో తొలి బోనం
03-08-2026 01:56 AM
నాగోల్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): ఆషాఢ బోనాల సందర్భంగా మన్సూరాబాద్లో కుమ్మర కులస్తులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. భక్తుల జయజయధ్వానాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య సాగిన ఈ ఊరేగింపులో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బో నాలు ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని అ మ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సం దర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.






