26 April, 2026 | 3:55 PM

మొక్కజొన్న పంట బుగ్గిపాలు

26-04-2026 02:06 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దారావత్ హరిరాల్ కి సంబంధించిన రెండు ఎకరాలు, ఈసం శ్రీకాంత్ కు మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఇలా అగ్నికి ఆహుతి కావడంతో నష్టం కలిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులు వెంటనే వారికి నష్టపరిహారం అందించాల్సిందిగా కోరుతున్నారు. మంటలు చెలరేగగానే వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల ప్రజలు గ్రామపంచాయతీ వాటర్ ట్రాక్టర్ ద్వారా నీటిని తెచ్చి మంటలు విస్తరించకుండా అడ్డుకోగలిగారు. అయితే అప్పటికే రైతులకు సంబంధించిన మొక్కజొన్న పంట, వ్యవసాయ సాగు పరికరాలు, మోటార్లు దగ్ధం అయ్యాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.