27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు

02-06-2026 12:57 PM

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) రాయ్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక ఉక్కు తయారీ(Steel Plant) కర్మాగారం క్యాప్టివ్ విద్యుత్ కేంద్ర విభాగంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. మందిర్ హసౌద్ పోలీస్ స్టేషన్(Mandir Hasaud Police Station ) పరిధిలోని 'మివాన్ స్టీల్' ప్లాంట్‌లో చెలరేగిన అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ మంటల నుండి దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలోకి ఎగసిపడిందని, అది కిలోమీటర్ల దూరం నుండే కనిపించిందని స్థానికులు తెలిపారు.