27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి

02-06-2026 11:04 AM

మెట్టపల్లి: సిద్దిపేట(Siddipet) అర్బన్ మండలం మెట్టపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. లారీ కింద కారు ఇరుక్కుపోయి అందులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.