మెదక్ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరబెట్టిన ధాన్యం దగ్ధం
02-06-2026 01:08 PM
వెల్దుర్తి : మెదక్ జిల్లా(Medak district) వెల్దుర్తి మండలం దామరంచలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం దగ్ధమైంది. రైతు నాచారం మహేశ్ కు చెందిన 40 బస్తాల ధాన్యం కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు దామరంచ శివారులో గడ్డికి నిప్పుపెట్టారు. గాలికి మంటలు వ్యాపించి వడ్లకుప్ప, ధాన్యం బస్తాలు దగ్ధం అయ్యాయి. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు మహేశ్ వేడుకుంటున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






