30 July, 2026 | 10:48 AM

బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

30-07-2026 10:10 AM

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ 

భూపాలపల్లి టౌన్, జూలై 30 ( విజయక్రాంతి) :  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గొర్లవీడు తండాలోని నిరుపేద కుటుంబం అయిన గుగులోతు సంతోష్ ఇంట్లోకి వరద నీరు చేరి అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ అధికారులు బాధిత కుటుంబాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి, ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు మంజూరు చేయడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.