తెలంగాణలో భారీ వర్షాలు.. 9 జిల్లాలకు ఆరెంజ్, 6 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వర్షం(Hyderabad rain) కురుస్తోంది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department) అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఉదయం 6 గంటల నుంచి నమోదైన వర్షపాతం వివరాలు
అత్యధికంగా వాజేడులో16.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటారునాగరం 15.2 సెంమీ, సర్వాయిపేటలో 14.3 సెంమీ, జైపూర్ లో 14 సెంమీ, బెజ్జూరులో 14 బ, ధర్మవరంలో 13.8 సెంమీ, కన్నాయిగూడెంలో 13 సెంమీ, వెంకటాపురం 12.6 సెంమీ, మహదేవ్ పూర్ లో 12.2 సెంమీ, నస్పూర్ లో 11.8 సెంమీ, ఆసిఫాబాద్ లో11.3 సెంమీ, సింగరేణి(రెబ్బన)లో 11.2 సెంమీ, కాగజ్ నగర్, మేడారంలో 10.6 సెంమీ, సిర్పూర్(టి)లో 10.5 సెంమీ, కౌతాలంలో 10.4సెంమీ, కాటారంలో 10.3 సెంమీ, నెన్నెల 10.3సెంమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రూడ్లపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.






