30 July, 2026 | 10:12 AM

సీఎం రేవంత్ విమానానికి తప్పిన ప్రమాదం

30-07-2026 09:33 AM

హైదరాబాద్: శంషాబాద్ లో కురిసిన అకస్మాత్తు భారీ వర్షం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ఈ ఘటన ఎయిర్ పోర్టులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం రాత్రి 20 నిమిషాలు గాలిలోనే చక్కర్లు కొట్టింది. క్లియరెన్స్ లేక ల్యాండింగ్ అవుతుండగా పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నాడు. నిన్న రాత్రి 8.35 గంటలకు ఎయిర్ పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

"హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ల్యాండింగ్ ప్రయత్నం అస్థిరంగా మారడంతో, సిబ్బంది గో-అరౌండ్‌ను ప్రారంభించారు. విమానం (6E-717) రెండవ ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అన్ని ప్రోటోకాల్‌లను పాటించాము." అని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ సేవల వివరాల ప్రకారం, జూలై 29న ఇండిగో విమానం 6E-717 సుమారు 20 నిమిషాల ఆలస్యంతో సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఇది రాత్రి 9 గంటలకు కొద్దిగా ముందుగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని అధికారులు వెల్లడించారు.