వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు
30-05-2026 10:08 PM
దోరకుంట గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఆర్డీవో సూర్యనారాయణ
కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామపంచాయతీ కార్యాలయం నందు శనివారం సర్పంచ్ పాలకి సురేష్ అధ్యక్షతన గ్రామంలో వరి కాల్చవద్దు, బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు అనే అంశంపై గ్రామసభ నిర్వహించారు. ఆర్డీవో సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంతోష్ గారు ఏ.డి.ఏ ప్రశాంతి అగ్రికల్చర్ ఆఫీసర్ మహేష్ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు రైతులు ,ప్రజలు పాల్గొన్నారు.






