30 July, 2026 | 10:41 AM

దుద్దెడ రాజీవ్ రహదారిపై ట్రక్కు బోల్తా

30-07-2026 09:35 AM

కొండపాక, జులై 30:(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ రాజీవ్ రహదారి(Duddeda Rajiv Highway) మూలమలుపు వద్ద ట్రక్కు బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు సిమెంటు లోడుతో వెళుతున్న ట్రక్కు రాజీవ్ రహదారి దుద్దెడ మూలమలుపు వద్ద రోడ్డుపై బోల్తా పడిందని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.