30 July, 2026 | 11:14 AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

30-07-2026 10:24 AM

- జైపూర్ ఎస్ ఐ భూమేష్

జైపూర్, (విజయక్రాంతి) : భారీ వర్షాలతో వాగులు ప్రవహించే నీరు రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతాలను తాత్కాలికంగా మూసి వేశామని, వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని జైపూర్ ఎస్ ఐ భూమేష్ కోరారు. భారీ వర్షాలు కురుస్తుందున వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు గోదావరి నది, చెరువుల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. అలాగే విద్యుత్ పరికరాలకు, పోల్స్ కు దూరంగా ఉండాలనీ, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా Dail 100కి లేదా స్థానిక పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలని సూచించారు.