1 June, 2026 | 4:33 PM

Breaking News

గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.

01-06-2026 03:37 PM

బోథ్,(విజయక్రాంతి): బజార్ హత్నూర్ మండలంలోని గిరిజాయి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కోవ లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాద సంఘటనలు కాలి బూడిదైంది. మంటలు అంటుకొని వేగంగా వ్యాప్తి చేనడంతో కుటుంబీకులు ఆకస్మిక అగ్ని ప్రమాదంతో ఆందోళన చెందారు. అయితే ఇంట్లో పూజ గదిలో భద్రపరిచిన 2 లక్షల రూపాయల నగలతో పాటు కట్టుబట్టలు గృహ ఉపకరణాలు ధాన్యం ఇతర సామాగ్రి విలువైన వస్తువు కాలిపోయాయి. సంఘటన గమనించిన గ్రామస్తులు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేటప్పుడు తీవ్రంగా శ్రమించారు. ఇంట్లోని సామాగ్రి పెద్ద మొత్తంలో అగ్నికి ఆవుతాయి దీంతో కుటుంబానికి తీరని నష్టం సంభవించింది.  అధికారులు నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు