4 May, 2026 | 3:50 AM

బాన్సువాడలో అగ్ని ప్రమాదం..

04-05-2026 02:41 AM

అప్రమత్తమైన స్థానికులు...తప్పిన పెనుముప్పు...

బాన్సువాడ, మే 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గల శివ లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుంది.గ్యారేజీలో ఉన్న కట్టెలకు మొదట మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు గ్యారేజీలో ఉన్న ఇతర సామాన్లకు వ్యాపించాయి. పొగలు, మంటలు పెద్ద ఎత్తున రావడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.

స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.

ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.గ్యారేజీలు, వరాపుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.