1 July, 2026 | 9:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పంట నష్టపోయిన రైతులకు తక్షణ నష్ట పరిహారం అందించాలి

04-05-2026 02:41 AM

బెజ్జంకి,మే3:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట కాలిపోవడంతో బాధిత రైతులను మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సంఘటన స్థలాన్ని ఆదివారం బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల ను రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, అరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే లోగానే అగ్నికి ఆహుతి కావడం ఎంతో బాధాకరం.

ముగ్గురు రైతులు సుమారు 10 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై, దాదాపు 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, వారి కుటుంబాల జీ వనాధారంపై పడిన గట్టి దెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు.కరెంట్ నిర్వహణలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. పొలాల్లోనే వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు సరైన రీతిలో లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.

ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత రైతులకు తక్ష ణ ఆర్థిక సహాయం అందించి, పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడతామని హెచ్చరించారు. వారి తో మండల నాయకులు లింగాల లక్ష్మణ్,మహిపాల్ రెడ్డి,తిరుపతి రె డ్డి, కనగాండ్ల తిరుపతి,కాచ్చు రాజయ్య, మ హేందర్ రెడ్డి,తదితరులు వున్నారు.