షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
- అర్ధరాత్రి చెలరేగిన మంటలు
పూర్తిగా కాలిన బట్టలు
కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం
రాజేంద్రనగర్ ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ లోనీ శ్రీ సిద్ధి వినాయక బట్టల దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోజు లాగే సోమవారం రాత్రి 10 గంటలకు షాపు యజమాని సంతోష్ బట్టల దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్ళాడు .
అర్ధరాత్రి మూడు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బట్టల దుకాణంలో ఒకసారిగా మం టలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు షాపు యజమాని సంతోష్ కు సమాచారం ఇవ్వడంతో సంతోష్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అం దించారు.
దాదాపు 3 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు లోకి తెచ్చినప్పటికీ అప్పటికే మూడు అంతస్తులో మంటలు వ్యాప్తి చెంది అందు లో ఉన్న బట్టలు పూర్తిగా కాళీ బూడిద అయ్యా యి. ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బట్టల షాప్ యజమాని సంతోష్ పూజారి తెలిపారు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.




