షార్ట్ సర్క్యూట్‌తో పరిశ్రమలో అగ్నిప్రమాదం
రూ.4 కోట్ల ఆస్తినష్టం?
కొండాపూర్, మే 2 (విజయక్రాంతి): షార్ట్ సర్క్యూట్‌తో పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపినా వివరాల ప్రకారం మండలంలోని మల్లేపల్లి శివారులో హేమా ఇండస్ట్రీస్ (ప్లైవుడ్) పరిశ్రమలో అర్థ్ధరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో ప్లైవుడ్ రా మెటీరియల్స్, ఫిల్లింగ్ మెటీరియల్స్, ఫ్లష్‌డోర్లు, యంత్రాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అలాగే పక్కనే ఉన్న గ్రీన్ క్రాఫట్స్ కంపెనీకి కూడా మంటలు వ్యాపించి అక్కడి యంత్రాలు, స్టాక్ ఇతర సామాగ్రి దగ్ధమైంది. ప్రాథమిక విచారణలో ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తేలింది. నష్టం వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






