6 July, 2026 | 1:51 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

10 వరకు వర్షాలే

04-05-2026 12:00 AM

వాతావరణ కేంద్రం

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు వర్షాలు కురువనున్నాయి. రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని, ఆ తర్వాత మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 10 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.